జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం మరువలేనిది : కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి

కర్నూలు జిల్లా : 11 నెలల కాలంలో కర్నూలు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందించిన సహాయ సహకారాలు మరువలేనని జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు తెలిపారు. సాధారణ బదిలీల లో భాగంగా కర్నూలు జిల్లా నుండి కోనసీమ జిల్లాకు బదిలీ పై వెళుతున్న సంధర్బంగా జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారికి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి కొండారెడ్డి బురుజు మీదుగా కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కనున్న జిల్లా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయం వరకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

వీడ్కోలు కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వాహనంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారిని ఎక్కించి పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక వాహనాన్ని స్వహస్తాలతో తాళ్ళతో లాగుతూ తమ అభిమానాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కేరింతల నడుమ జిల్లా ఎస్పీ గారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపియస్ ధీరజ్ కునిబిల్లి , అడిషనల్ ఎస్పీలు ప్రసాద్, నాగబాబు, రమణ, డిఎస్పీలు యుగంధర్ బాబు, కెవి మహేష్ , ఇలియాజ్ భాషా, డిపిఓ ఎఓ సురేష్ బాబు, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *