కోస్తాకు మరోమారు భారీవర్షాల ముప్పు పొంచి ఉంది.

ఈ నెల 19న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 24 గంటల్లో ఇది బలపడనున్నది. ఇది వాయుగుండం/తీవ్ర వాయుగుండంగా మారుతుందా? లేదా? అనేది వాతావరణ శాఖ ప్రకటించకపోయినా 17న కోస్తా, యానాం ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, ఈ నెల 18 నుంచి కోస్తా, ఒడిసాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రభుత్వం, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.