వార్షిక బడ్జెట్‌ లో రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

  రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాల పథకం కసం రూ.13.7 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 2022-23 బడ్జెట్లో రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక నిధి ద్వారా అందిస్తున్న రుణాల కాలవ్యవధిని మరో ఏడాది పొడగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ వడ్డీ రహిత రుణాలను 50 ఏళ్ల వ్యవధితో ఇస్తుండగా.. రాష్ట్రాల సాధారణ రుణాలకు ఇది అదనం. పీఎం గతి శక్తి, రాష్ట్రాల ఇతర మూలధన పెట్టుబడుల కింద ఈ నిధులను కేటాయిస్తారు.. 2022-23లో రాష్ట్రాలకు ద్రవ్యలోటు పరిమితుల్లో ఊరటనిచ్చింది కేంద్రం. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు ద్రవ్యలోటు కు అనుమతినిచ్చింది.