పాతబస్తీలో అన్నా చెల్లెళ్ల దారుణ హత్య

హైదరాబాద్‌ పాతబస్తీ రెయిన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధీనా నగర్‌లో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు.ప్రేమించావ్‌ పెళ్లి చేస్కో అని ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశారు.ఈ కేసు వివరాలిలా ఉన్నాయి నారాయణఖేడ్‌కు చెందిన రాధిక , పాతబస్తీకి చెందిన ముస్తాఫా ప్రేమించుకున్నారు. కాగా, శనివారం రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లిన రాధిక ప్రేమించావు పెళ్లి చేస్కో అని ముస్తాఫాను నిలదీశారు.ఈ క్రమంలో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రాధికకు మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్‌ కలిసి రాధికని దారుణంగా హత్య చేశారు. కత్తితో యువతిని పొడిచి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులకు అదుపులోకి తీసుకున్నారు.