ఇంగ్లాండ్ పయనమైన టీమిండియా జట్టు.

గత రెండు వారాలుగా త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టూర్ కోసం ముంబైలో ఒక హోట‌ల్‌లో క్వారంటైన్ లో ఉంటున్న టీమిండియా ఆటగాళ్లు నిన్న అర్ధ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో ఇంగ్లాండ్ పయనమయ్యారు. ఈ సమాచారాన్ని బీసీసీఐ అధికారికంగా షేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్, పుజారా ఇతర ఆటగాళ్లు ఇంగ్లాండ్ పయనమయ్యారు. అయితే ఈ పర్యటనలో అందరి దృష్టి కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ కూతురు వామిక‌ పై పడింది. ఈ పర్యటనలో న్యూజిలాండ్‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడ‌నుంది. ఇంగ్లండ్‌కు బ‌య‌లుదేరే ముందు కెప్టెన్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఏ టీమ్ ఒక్కో సెష‌న్‌, ఒక్కో గంట మెరుగైన ఆట ఆడుతుందో ఆ టీమ్‌దే చాంపియ‌న్‌షిప్ అని కోహ్లి అన్నాడు. ఇంగ్లండ్ కండిష‌న్స్ త‌మ‌తోపాటు న్యూజిలాండ్‌కు కూడా ఒకేలా ఉంటాయ‌ని, ఆ లెక్క‌న రెండు టీమ్స్ స‌మ‌వుజ్జీలుగానే ఉన్న‌ట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు