టీడీపీ-వైకాపా దొందు దొందేనని:జనసేననేత కోళ్ళబాబి

రాజోలు:ప్రజలను దోచుకోవడంలో టీడీపీ, వైఎస్సార్సీపీలు దొందు దొందేనని జనసేన నాయుకుడు కోళ్ళబాబి విమర్శించారు. ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వడం జనసేన, బిజెపి కల అని పేర్కొన్నారు. ప్రతిఇంటి బిల్లులో కమిషన్ టిడిపి వైసీపీ ల విధానమని దుయ్యబట్టారు. అవినీతి చంద్రన్న పాలనా అడుగు అడుగున అరాచకం జగనన్న పాలన చందంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ జనసేన రాష్ట్రపార్టీ సూచనమేరకు పేదలకు ఇంటికోసం జనసేన-బిజెపీ పోరుబాట కార్యక్రమం బుధవారం రాజోలు నిర్వహించారు. నిరసన దీక్ష కార్యక్రమంలో చింతాప్రసాద్, కంపాటిసాయికుమార్,కోళ్ళబద్రీ, కోణిదలరఘు, కాళ్ళనాగబాబు, కూనపరెడ్డిశ్రీరామ్, కోణిదల రాఘవనాయుడు,మలిపూడిగోపి, కోళ్ళమణి తదితరులు పాల్గొన్నారు..