కొత్తచెరువు శాఖ గ్రంధాలయంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తచెరువు శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ అధికారి కె. జయరాం ఆధ్వర్యంలోయువతకు స్ఫూర్తిదాత స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అదేవిదంగా యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఊడేందుకు భారత హోమ్ మంత్రిత్వశాఖ నిర్వహించే “నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో” డ్రగ్స్ వాడకం మాకొద్దు మాజీవితమే మాకు ముద్దు అనే కార్యకమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం ప్రత్యేక యాప్ ద్వారా సర్టిఫికెట్లు డౌన్లోడ్ చెలుకోవడం జరిగిందని గ్రంథాలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠకులు,యువకులు వెంకటరమణ, వలిసాబ్, మహమ్మద్,రమేష్, శ్రీరాములు, ఓబులరాజు విజయభాస్కర్,వెంకటప్ప, మున్నీర్ తదితరులు పాల్గొన్నారు.