ఏకాంతంగా విశేష పూజ కార్యక్రమాలు స్వామివారికి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండల సమీపంలోని పెంచలకోన లో వెలసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు సోమవారం
ఉదయంపవిత్రోత్సవాలలో రెండవ రోజు సందర్భంగా ఉదయం విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనం, ద్వార తోరణ ధ్వజ కుంభ పూజ చతుర్స్థానార్చన విశేష హోమం పవిత్ర ప్రతిష్ట పవిత్ర సమర్పన పూర్ణాహుతి నవ కళశ స్నపన తిరుమంజనం విశేషంగా ఏకాంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సీతారామయ్య స్వామి, పెంచలయ్య స్వామి ఈఓ జొల్లు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.