నెల్లూరు జన సైనికుడి గా సుజయ్

జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడుగా దుగ్గిశెట్టి వెంకట సుజయ్ ఎన్నికయ్యారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు ఈయన గతంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఎన్నికైన సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.