గుండెపోటుతో ఏ.ఎస్.ఐ మృతి

కొనకనమిట్ల పోలీస్ స్టేషన్లో  : ఏ.ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న మందపాటి చంద్రశేఖర్ రాజు (రాజు) ఈ రోజు ఉదయం కొనకనమిట్ల వెళ్లే క్రమంలో మార్కాపురం బస్టాండ్ లో అకస్మాత్తుగా గుండెపోటు తో మృతి చెందారు.ఆయన మృతి వార్త తెలుసుకున్న కొనకనమిట్ల ఎస్సై ఫణిభూషణ్ మరియు సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా మృతి చెందిన ఏ. ఎస్సై రాజు స్వగ్రామం కంభం. మరి కాసేపట్లో ఆయన మృతదేహాన్ని కంభం కి తరలిస్తారని సమాచారం. ఆయన తండ్రి నరసరాజు గతంలో పొదిలి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.