విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో RIO కి వినతి పత్రం సమర్పణ

జిల్లా వ్యాప్తంగా తిరుపతి పట్టణంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ఆర్ఐ చైతన్య , నారాయణ జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని వాటి గుర్తింపు రద్దు చేయాలని టి ఆర్ ఎస్ ఎఫ్ ,ఆర్ ఎస్ ఎ,పి డి ఎస్ ఓ, సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాజు, రాయలసీమ విద్యార్థి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి . ఓబులేసు ,పిడిఎస్ ఓ రాయలసీమ కన్వీనర్ ఓబులేసు లు మాట్లాడుతూ ఈరోజు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ యాజమాన్యం వారు నీట్ ఎంసెట్ వంటి ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధిక ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిని జిల్లా ప్రాంతీయ విద్యాశాఖ అధికారి ఇంటర్మీడియట్ బోర్డు శ్రీనివాసులు రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ చైతన్య విద్యా సంస్థలు విచ్చలవిడిగా పరీక్షలు జరుగుతున్నా యి  అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతోంది అడ్వాన్స్ సప్లిమెంటరీ పేరుతో ఇప్పటికే విద్యార్థుల దగ్గర అధిక  ఫీజులు  రాబట్టారు వీటి పై తగిన పర్యవేక్షణ  జరిపి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు జరిగే అడ్వాన్స్ స ప్లిమెంటరీ పరీక్షలకు మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా వారు తగిన పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జగన్ ,కిషోర్ ఎస్ వి యూ యూనివర్సిటీ నాయకుడు వెంకట్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.