శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో లేళ్ల అప్పి రెడ్డి

మండల కేంద్రమైన మోపిదేవి లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పి రెడ్డి దర్శించుకున్నారు. అవనిగడ్డ శాసనసభ్యులుశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో లేళ్ల అప్పి రెడ్డి సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు లు అప్పిరెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి, శ్రీ అమ్మ వార్లను దర్శించుకున్న అప్పిరెడ్డి, సింహాద్రి, కడవకోల్లు లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ G.V.D.N. లీలా కుమార్ ఆయనకు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేసి, ఆలయ మర్యాదలతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు, పి.ఏ.సి.యస్ చైర్ పర్సన్ కామిసెట్టి వెంకట సురేష్ బాబు, మోపిదేవి గ్రామ పంచాయతీ 4 వ వార్డు సభ్యులు కేసగాని రాము, నందిగం అభిషేక రావు తదితరులు పాల్గొన్నారు.