శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు సోనూసూద్‌ ఆర్థిక స‌హాయం

ఫ‌లానా వాళ్లు ఆప‌ద‌లో ఉన్నారు` అంటూ ఓ ట్వీట్ వేస్తే చాలు. త‌క్ష‌ణం సోనూ నుంచి సాయం అందేస్తోంది. ఇప్పుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ విష‌యంలోనూ సోనూ ఇలానే ఉదార‌త చాటాడు. ఆప‌న్న‌హ‌స్తం అందించాడు. కోవిడ్ తో శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆసుప‌త్రి పాల‌య్యారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. వైద్యానికి చాలా డ‌బ్బులు అవ‌స‌రం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ‌ని ఆదుకోవాల‌ని శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుంటుంబం మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ సంగ‌తి సోనూని తెలిసి, శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. “నేను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతున్నా. ఆయ‌నకు కావ‌ల్సిన స‌హాయం అందించ‌డానికి సిద్ధంగాఉన్నా“ అంటూ సోనూ ట్వీట్ చేశాడు. దాంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆసుప‌త్రి బిల్లుల స‌మ‌స్య దాదాపుగా తొల‌గిపోయిన‌ట్టే. వంద‌లాది చిత్రాల్లో వేలాది పాట‌ల‌కు నృత్య రీతులు స‌మ‌కూర్చారు శివ శంక‌ర్ మాస్ట‌ర్‌. జాతీయ స్థాయిలో అవార్డుకూడా అందుకున్నారు.
తెలుగు హీరోల‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధ‌మే ఉంది. వాళ్లంద‌రికంటే ముందు.. సోనూ స్పందించి, ముందుకు రావ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం.