జూన్ 4న విడుదల కానున్న మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా టీజర్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాణ సారథ్యంలో సీనియర్ నటుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. యువ దర్శకుడు, రచయిత డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా మూవీ టీజ‌ర్‌కు టైం ఫిక్స్ చేశారు.30 సంవత్సరాల క్రిందట జూన్‌ 4న విడుదలయి సూపర్ హిట్ అయిన “అసెంబ్లీరౌడీ” విడుదల రోజున ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉందని వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రం రూపొందుతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు.