రాష్ట్రాన్ని పాలించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్: సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని పాలించడం చేతకాని అసమర్థుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. వకీల్ సాబ్ చిత్రానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. భాజపా జనసేన అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారని. తిరుపతి ఉపఎన్నికలో భాజపా జనసేన కూటమికి వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదని అందుకే వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.