ప్రకాశంజిల్లా కొమరోలు మండలంలో మట్టి మాఫియా
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం లోని బ్రాహ్మణ పల్లె పంచాయతీ పరిధిలో కాండ్ల వాగు లో NRGC కి సంబంధించిన చెక్ డాముల కట్టలను తొలగించి మట్టిని అమ్ముకుంటున్న మట్టి మాఫియా కొమరోలు పోరుమామిళ్ల జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి లేఅవుట్లకు కొంతమంది మట్టి మాఫియా రాత్రి సమయంలో కాండ్ల వాగులో ఉన్నటువంటి చెక్ డాం కు ఉన్నటువంటి కట్టమట్టిని రాత్రి సమయంలో జెసిబి ల సహాయంతో మట్టిని తొలగించి మట్టిని అమ్ముకుంటున్న, పట్టీ పట్టనటువంటి వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మట్టి మాఫియా దగ్గరనుంచి భారీగా ముడుపులు ముట్టాయని లేకపోతే అధికారులకు తెలియకుండానే కాండ్ల వాగులో నుంచి రెవెన్యూ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధి దూరము ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.