ఖైరతాబాద్ లో వచ్చే ఏడాది నుంచి మట్టిగణపతి.. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం!

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం విషయంలో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి 70 అడుగుల మట్టిగణపతిని ప్రతిష్ఠించి, చివరికి మండపంలోని నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.