అనారోగ్యంతో కన్ను మూసినా శివశంకర్ మాస్టర్

గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు  శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.