తండ్రి సినిమాతోనే అడుగు పెట్టబోతోన్న మహేష్ బాబు కూతురు

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులుగా ముద్దుల కూతురు సితార ఘట్టమనేని తండ్రి సినిమాతోనే అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే తన తండ్రితో కలిసి సర్కారు వారి పాట సినిమాలో ఒక సాంగ్ లో కనిపించింది. సాంగ్ కేవలం ప్రొమోషనల్ గా మాత్రమే ఉపయోగించారు.ఇక ఈసారి మాత్రం సినిమాలోనేభాగం కానుంది అని తెలుస్తుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు. ఇక ఒకటి రెండు రోజుల్లో సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్  బయటకు వచ్చి నెట్టింట వైరల్ అయ్యింది.