బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టిన భారత క్రీడాకారిణి సింధు

 బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ థాయిలాండ్‌ ఓపెన్‌లో భారత టాప్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది.