వెండితెర సత్యభామ ఇంకా లేరు

 తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటి జమున​ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై దశాబ్దాలుగా రాణించిన జమున. తెలుగు, తమిళ్‌లో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించిన జమున.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు జమున భౌతిక కాయాన్ని   ఫిలింనగర్ ఛాంబర్ కు తీసుకురానున్నారు.

నేపథ్యం

జమున 1936 ఆగష్టు 30 న హంపీలో జన్మించారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. జమున బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. సినీనటుడు జగ్గయ్యదీ కూడా జమున గ్రామమే. దాంతో.. జమున కుటుంబానికి జగ్గయ్యతో ఎంతో కాలంగా పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి బెరుకు అంటే తెలియన జమున స్కూలులో చదివేకాలం నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలయ్యింది.   నాటకాలలో ఆమె ప్రతిభ అందరికి తెలియడంతో.. సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

నటించిన సినిమాలు

అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర అగ్ర నటుల సరసన హీరోయిన్‌గా నటించారు. జమున తన కెరీర్‌లో ఎన్ని పాత్రలలో నటించినప్పటికి.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం.. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారు జమున.   శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్రలో నటించి.. తెలుగువారికి సత్యభామ అంటే జముననే అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. . తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించారు జమున. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు ..  జమున రాజకీయాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణించారు.. ఇందిరా గాంధీ మీద ఉన్న అభిమానంతో.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. 1989 ఎన్నికల్లో రాజమండ్రి నియోకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నియకయ్యారు. తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నా.. బీజేపీ తరఫున ప్రచారం చేశారు.

అవార్డులు : 1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మూగ మనసులు

  • 1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మిలన్
  • 2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం
  • 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జమున జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

1965లో జూలూరి రమణారావును జమున వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో రమణారావు గుండెపోటుతో మరణించారు. కాగా జమున, రమణారావు దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.