అగ్నిప్రమాద బాధితులకు శ్యామ్ కిషోర్ సాయం

శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు అగ్నిప్రమాద బాధితులకు సాయం అందించారు. ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సూరిబాబు, తల్లి వెంకటలక్ష్మి లకు చెందిన గృహం ఈనెల 4వ తేదీన వంట గ్యాస్ లీక్ కావడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. గాదె వేంకటేశ్వర రావు ( జి. వి. ఆర్ ) ఈ విషయాన్నీ శ్యామ్ కిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన శ్యామ్ కిషోర్ శనివారం ఉదయం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తనవంతు సాయం చేశారు.

నిత్యవసర సరుకులు, బియ్యం కట్ట,దుప్పట్లు, చీరలు, వంట సామాగ్రి ని శ్యామ్ కిషోర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్కురి సీతా రామ రాజు, పి. ఏ. సి. యస్. మాజీ డైరెక్టర్ సూరిబోయిన నాగేశ్వర రావు, ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, గాదె వేంకటేశ్వర రావు,తమ్మన సోమేశ్వర రావు, ఆకుల శ్రీనివాస రావు, రామిసెట్టి బాబుజ్జి, దాకినేని కృష్ణ, నడికట్ల బాల రాజు, మేకా పాములు, శీలం శ్రీనివాస రావు, సారేపల్లి శ్రీనివాస రావు, తాడికొండ వేంకటేశ్వర రావు, పోతన కాకులేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.