శ్రీలంక సీరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్.. వైస్ కెప్టెన్ గా భువి.

త్వరలో శ్రీలంక తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ కోసం పర్యటించనున్న భారత జట్టు కోసం బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. అనూహ్యంగా టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ను ఎంపిక చేసింది. అంతే గాక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను వైస్‌-కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సిరీస్‌ జూలై 13 నుంచి 25 వరకు జరగనుంది. జట్టు వివరాలిలా ఉన్నాయి.. శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హర్దిక్‌ పాండ్య, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, కే గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, వీ చక్రవర్తి, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా సెలెక్ట్ కాబడ్డారు.