పిడిఎస్ బియ్యం వ్యాన్ పట్టి వేత ఇరువురు అరెస్టు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో అశోక్ లేలాండ్ వాహనంలో మంగళవారం పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించు చున్నరనే సమాచారంపై అన్నవరం ఎస్.ఐ. రవికుమార్ పోలీస్ ఆకస్మికంగా దాడిచేసి పట్టుకున్నారు. ఎ. పి.39టిజె2826 వాహనంలో
65 బ్యాగ్స్ తో కూడిన 3,250 కేజీ లు పిడిఎస్ స్వాధీనం చేసుకొన్నారు.వ్యాన్ డ్రైవర్ బండి శ్రీను, బియ్యం ఓనర్ కాళ్ళ సత్యనారాయణ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పిడిఎస్ రైస్ తదుపరి చర్య నిమిత్తము శంఖవరం మండల సివిల్ సప్లైస్ అధికారులకు అన్నవరం స్టేషవద్ద పోలీసులు అప్పగించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం పై ఇద్దరిపై 6A కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్ పౌరసరఫరాల కాకినాడ వారి కోర్టులో దాఖలు పరుస్తామని సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. 3250 కేజీల బియ్యం భద్రత నిమిత్తం ఎమ్.ఎల్.ఎస్.  పాయింట్ గొల్లప్రోలు, పిఠాపురం నకు పంపిస్తున్నట్లు వివరించారు.