బనగానపల్లే ఎమ్మెల్యే కాటసాని వినతి పత్రం అందిచిన సచివాలయం సిబ్బంది

కర్నూల్ జిల్లా బనగానపల్లేని యోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు గ్రామ,వార్డు సచివాలయం సిబ్బంది బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో 1,30,000 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించడం జరిగిందని ,అలాగే CBAS పరీక్షలను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. అయితే తమ. ప్రోబిషనరి పీరియడ్ అయిపోయి మూడు నెలల కాలం అయిందని అయితే తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణలోకి జూలై నెల నుంచి తీసుకుంటాం అని ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందని అయితే తమను జనవరి నెల నుంచి ప్రొబిషనరి కాలాన్ని డిక్లేర్ చేసి నూతన PRC ని జనవరి నెల నుంచి అందెటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. 2021 అక్టోబర్ నెల నుంచి నూతన జీత ,భత్యాలు ఇచ్చెటట్లు చర్యలు తీసుకోవాలని,రెండు ఇంక్రిమెంట్ ఇవ్వాలని,మరణించిన సచివాలయం ఉద్యోగ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగం ఇవ్వాలని,E.H.S, హెల్త్ కార్డ్ లు మంజూరు చేయాలని, సచివాలయం ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలకు అవకాశాన్ని కల్పించాలని అలాగే APPSE చేపట్టే డిపార్ట్ మెంట్ టెస్ట్ పరీక్షలు నోటిఫికేషన్ నంబర్ 22/2021 పరీక్షలు నిర్వహించి త్వరితగతిన ఫలితాలు విడుదల చేయాలని ఇవి తమ ప్రధాన డిమాండ్ లు అని తమ సమస్యలను ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తమ సమస్యల పరిష్కారానికి శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి కృషి చేయాలని కోరారు. శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా విన్న తరువాత సచివాలయం ఉద్యోగుల సమస్యలను ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సచివాలయం సమస్యలను తీర్చడానికి కృషిచేస్తానని అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో బనగానపల్లె నియోజకవర్గ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.