అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ వేల్పుల సునీత

మండల కేంద్రమైన కంచికచర్ల ఇందిరా కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీటీసీ మాడుగుల మధు, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులతో కలసి సర్పంచ్ వేల్పుల సునీత సోమవారం అంగన్వాడి కేంద్రం ను సందర్శించారు. కొద్దిరోజుల క్రితం అంగన్వాడీ కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా కరెంటు లేక పిల్లలకు గాలి వెలుతురు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంగన్వాడీ టీచర్ వాణి సర్పంచ్ వేల్పుల సునీత దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్ వేల్పుల సునీత పంచాయతీ నిధులతో కరెంటు మీటర్ ఏర్పాటు చేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలో లైట్లు ఫ్యాను ఏర్పాటు చేయగా గాలి వెలుతురు బాగా వస్తుందని అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడి టీచర్ వాణి, ఆయా సర్పంచ్ వేల్పుల సునీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కోడిగుడ్డు పెడుతున్నారా అని పిల్లలను అడగ్గా పెడుతున్నారని పిల్లలు చెప్పారు. మెనూ ప్రకారం పిల్లలకి పోషకాహారం అందించాలని ఆయాకి సూచించారు. అనంతరం పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాడుగుల మధు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీ వేల్పుల శ్రీనివాసరావు, మాడుగుల ఆంజనేయులు, కావాటి రాంబాబు, గుగులోతు శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *