హ‌త్యాచార నిందితుడి కోసం రంగంలోకి సూపర్ కాప్ స‌జ్జ‌నార్

సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో హ‌త్యాచార నిందితుడి కోసం పోలీసుల వేట కొన‌సాగుతూనే ఉంది. 6 సంవ‌త్స‌రాల పాప‌ను పాశ‌వికంగా హ‌త్యాచారం చేసి పారిపోయాడు. పాప కాళ్లు, చేతులు కూడా విరిచేశాడు అంటూ పాప త‌ల్లి రోధిస్తుంటే అక్క‌డున్న వారికి క‌న్నీళ్లు ఆగ‌టం లేదు. ఆ పాప ఎంత చిత్ర‌హింస‌లకు గురి అయ్యిందో… అంత‌క‌న్నా ఎక్కువ చిత్ర‌హింస చేసి ఆ కిరాత‌కున్ని చంపాల‌ని స‌ర్వ‌త్రా డిమాండ్ వినిపిస్తుంది.

మ‌రోవైపు నిందితున్ని ప‌ట్టుకోవ‌టంలో పోలీస్ శాఖ వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. రోజులు గ‌డుస్తున్నా క‌నీసం ఒక్క క్లూ కూడా సంపాదించ‌లేక‌పోయారు. దీంతో 10ల‌క్ష‌ల రివార్డు, ఆ మృగాడి ఫోటోను రిలీస్ చేశారు.

ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో సూపర్ కాప్ గా పేరున్న ఐపీఎస్ స‌జ్జ‌నార్ ఇప్పుడు రంగంలోకి దిగారు. స‌జ్జ‌నార్ ప్ర‌స్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దీంతో ఆ నిందితుడు ఆర్టీసీ బ‌స్సుల్లోనే ప్ర‌యాణించే అవ‌కాశం ఉండ‌టంతో… ప్ర‌తి బ‌స్ స్టేష‌న్, బ‌స్సులో ఆ మృగాడి ఫోటో పెట్టాల‌ని ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవ‌ర్స్, కండ‌క్ట‌ర్స్ తో పాటు అంతా అల‌ర్ట్ గా ఉండాల‌ని… నిందితుడి క‌ద‌లిక‌లుగా అనుమానం ఉంటే వెంట‌నే లోక‌ల్ పోలీసుల‌కు తెలియ‌జేయాల‌ని ఆదేశించారు.