కరోనా బాధితుల సంఖ్యలో రెండవ స్థానానికి చేరిన రష్యా..!

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నా, కరోనా మహమ్మారి ప్రభావం ఏ మాత్రం తగ్గకపోగా, దాని ప్రభావం మరింత పెరుగుతుంది. రష్యాలో కూడా ఎంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నా సరే, ఉపయోగం లేకుండా పోతుంది. మొన్ననే ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య లో యూ.కెని వెనక్కినెట్టి మూడవ స్థానానికి చేరినా రష్యా, అయితే ఇప్పుడు కొన్ని రోజుల వ్యవధిలోనే స్పెయిన్ ని కూడా వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరింది.

రష్యాలో గడచిన 24 గంటల్లో 9,709 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో, 2,77,719 మంది కరోనా బాధితులు ఉన్న స్పెయిన్ ని వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరింది.! దాంతో రష్యాలో 2,81,752 మందికి కరోనా వ్యాపించగా వారిలో 2,631 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రష్యాలో 67,373 మంది రికవరీ అయ్యారు.