జల జీవన్ మిషన్ ద్వారా నందిగామ నియోజకవర్గానికి రూ.52.57 కోట్లు మంజూరు

తాగునీటి సమస్య నివారణకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని శాసనసభ్యుడు డా”మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ,ఈ సందర్భంగా డా”జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నీటి విషయంలో గత ప్రభుత్వాలు చేసిన దాని కన్నా మెరుగ్గా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు ,ముఖ్యంగా తాగునీటి సమస్య నివారణకు కృషి చేయడమే కాకుండా పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు ,ప్రతి నీటి బొట్టును సమర్ధవంతంగా వినియోగించుకునేలా అవగాహన కలిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

రెండు, మూడు కి.మీలు వెళ్లే పరిస్థితి స్వస్తి

గత ప్రభుత్వాల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని డా”జగన్ మోహన్ రావు పేర్కొన్నారు ,ముఖ్యంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని ,రెండు మూడు కి.మీ.లు కాలినడకన వెళ్లి తాగునీటిని తెచ్చుకున్న ఘటనలు కూడా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు ,గుక్కెడు తాగునీటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నా గత ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించాయి తప్ప కనీసం స్పందించలేదని ఆరోపించారు ,కానీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించటమే కాకుండా వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

జల జీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు మంజూరు చేసిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే డా”జగన్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు