టీడీపీ నేత లోకేష్‌ను మరోసారి టార్గెట్ చేసిన రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శల దాడి చేశారు. తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పై తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేశారు.
లోకేష్ తిన్నది అరగక, పని పాట లేకుండా అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వకుండా తండ్రి, కొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడినవారిని అరెస్ట్ చేస్తే మాత్రం పరామర్శించేందుకు పరుగెత్తుకొని రాష్ట్రానికి వ‌చ్చారంటూ మండిప‌డ్డారు ఇక‌, సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన వ్యక్తి వైఎస్ జ‌గ‌న్ అని అన్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో జగన్ ముందు చూపుతో వ్యవహరించారంటూ ప్ర‌శంసించారు.