కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

నెల్లూరు:  కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి చెందారు. కరోనాతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో కోటయ్య చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో ఇవాళ మృతి చెందారు. కరోనా సోకిన తర్వాత ఆనందయ్య ఔషధాన్ని కొటయ్య తీసుకున్న విషయం తెలిసిందే.  ఔషధం తీసుకున్నాక కోలుకున్నట్లు గతంలో కొటయ్య ప్రకటించారు. కోటయ్య ప్రకటనతో ఆనందయ్య ఔషధం వెలుగులోకి వచ్చింది.