నూతన జిల్లా కేంద్రం బాపట్లకు రేపల్లె నుంచి అదనపు ఆర్టీసీ బస్ లు మరియు ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేయాలాని ఆర్టీసీ డియంకి వినతిపత్రం.

రేపల్లె టౌన్: నూతన జిల్లా కేంద్రం బాపట్లకు రేపల్లె నుంచి అదనపు ఆర్టీసీ బస్ లు మరియు ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేయాలాని ఆర్టీసీ డియం గారికి వినతిపత్రం..సీపీఎం రేపల్లె డిపో మేనేజర్ డివిఎన్. ప్రసాద్ గారికి సీపీఎం పార్టీగా వినతిపత్రం అందచేయటం జరిగింది.అనతరం సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. దానిలో బాగంగా గుంటూరు జిల్లాలో రేపల్లె,వేమూరు నియోజకవర్గాల ప్రజలను నూతనంగా ఏర్పాటు చేసినా బాపట్ల జిల్లాలో చేర్చారు. ఇప్పటికే పరిపాలన కార్యకలాపాలు,ప్రభుత్వ కార్యాలయాలు బాపట్ల కేంద్రంగా ప్రారంభించారు రేపల్లె,వేమూరు నియోజకవర్గాల పరిధిలో ప్రజలు వివిధ కార్యాలయాలు పని మీద జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్ల చేరుకోవాలి అంటే రైలు మార్గం లేనందునా కేవలం బస్ లు ద్వారానే చేరుకోవాలి.కానీ రేపల్లె డిపో పరిధి నుంచి గతంలో ఉన్న బస్ లు మాత్రమే నడుపుతున్నారు. దీనితో ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా వివిధ సమీక్ష సమావేశాలకు, డ్యూటీలుకి వెళుతున్న చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన సరియైన బస్ సదుపాయాలు లేక1 ఇబ్బందులు పడుతున్నారు, ఆర్డనరి బస్ లు వల్ల చాల సమయం పడుతుంది కావున ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉంటే సమయం కలిసివస్తుంది, సులభంగా జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరో పక్క ప్రవేట్ వాహనాలు వాళ్ళు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు,భద్రత లేని ప్రయాణం అని భయం వ్యక్తం చేస్తున్నారు.కావున బాపట్ల జిల్లా కేంద్రంకి ప్రజలు సులభంగా చేరుకోవడానికి వీలుగా అదనపు బస్ సర్వీసులు,ఎక్సప్రెస్ సర్వీసులు తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నారు.ఆర్టీసీ డియం గారు సానుకూలంగా స్పందించి ఇంకా ఆర్టీసీ విభాగం బాపట్ల జిల్లాగా కార్యాలయం ఏర్పాటు చేయలేదు పై అధికారులుతో చర్చించి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా బస్ లు ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కె.శరత్ బాబు,కె.అశ్విరాదం, జె.ధర్మారాజు తదితరులు పాల్గొన్నారు.