ఘనంగా దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించా రు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నా యి.
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రత్యేకతలు
ఆత్మదేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదటిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఆత్మనిర్భర్’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు అందరినీ ఆకట్టుకున్నాయి.
దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వారికి శ్రద్ధాంజలి ఘటించారు.