రవితేజ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది..
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు అభిమానులతో మాస్ మహారాజ్ గా కీర్తింపబడుతున్న హీరో రవితేజ. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన తాజా చిత్ర యూనిట్ అభిమానులకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి టీజర్ ను అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చింది చిత్ర యూనిట్. క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ..మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపేషన్ తో సంక్రాంతి హీరోగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇదే జోష్ లో ఖిలాడి తో ప్రేక్షకులను అలరించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.