మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ !

 మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో గెస్ట్ రోల్ లో  రవితేజ .. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’  టైటిల్​ అనుకుంటున్నారు. ఇది దాదాపు ఖరారైందని, త్వరలో ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. కెరీర్​ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత చిరుతో స్క్రీన్ షేర్​ చేసుకోనున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ  ఆ తర్వాత పలు హిట్​ సినిమాలు తీశారు. చిరుతో తను చేయబోయే కొత్త సినిమాలోని ఓ రోల్​ కోసం ఈ డైరెక్టర్ రవితేజను రిక్వెస్ట్​ చేశారు. దానికి అతడు అంగీకారం కూడా చెప్పాడట. రవితేజ పుట్టినరోజున(జనవరి 26) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే చిరు చేస్తున్న సినిమాల్లో పలువురు హీరోలు గెస్ట్​ రోల్స్ చేస్తున్నారు. ‘ఆచార్య’లో రామ్​చరణ్, ‘గాడ్​ఫాదర్’లో సల్మాన్​ఖాన్ నటిస్తున్నారు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు.