రవితేజ సినిమాకి కరోనా సెగ.

ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఎటువంటి బ్రేక్ లేకుండా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అంటూ మరో సినిమకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ లో చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం. తాజాగా మిగిలిన టాకీ పార్ట్ కోసం ఇటలీ పయనమయ్యింది. రవితేజ తో భారీ ఎత్తున ఫైట్ చేజ్ సీన్ ఇప్పటికే చిత్రీకరించారు. అనసూయ కూడా ఈ సినిమా కోసం ఇటలీ చేరుకుంది. తాజాగా ఈచిత్రానికి కరోనా బ్రేకులు వేసింది. ఆఖరి షెడ్యూల్‌ దాదాపు పూర్తయ్యే సమయంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్ తగలడంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది. ఇటలీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ఖిలాడి సినిమా షూటింగ్‌కు అనుమతులను నిలిపివేసింది. ఇప్పటికే మే28న విడుదలకు ప్లాన్ చేసిన నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్‌ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.