రవన్న పాత్ర కూడా నాలో పెద్ద భాగమైంది : దగ్గుబాటి  రానా

హీరో  దగ్గుబాటి  రానా నటించిన తాజా చిత్రం” విరాటపర్వం”  సాయిపల్లవి హీరోయిన్​. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకొన్న  సందర్భంగా వరంగల్‌లో ఆత్మీయ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ   “ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే.. కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతా. చేసిన ప్రతీ పాత్రకి సంబంధించిన ఏదో ఒక అంశం నాలో ఉంది. రవన్న పాత్ర కూడా నాలో పెద్ద భాగమైంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు? యాక్షన్‌ సినిమా చేయొచ్చు కదా అని అడిగేవారు. ఓ సినిమాని అభిమానుల కోసం, ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాం. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని ‘ఇది నిజమే కదా..’ అని నమ్మి ఒకరు చూస్తుంటారు. వాళ్ల కోసమే ఈ సినిమా చేశా” అని అన్నారు.