400 గిరిపుత్రులకు అండగా నిలిచిన దగ్గుబాటి రానా.

రెండో దశ కరోనా వ్యాప్తిలో దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకువచ్చి తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. సోనూ సూద్ మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి, నిఖిల్ వంటి యువ నటులు వరకూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా వీరితో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా చేరాడు. నిర్మ‌ల్ జిల్లాలోని గిరిజ‌న కుటుంబాల‌కు ప్రాథమికంగా అవసరమైన నిత్యావసరాలు కూడా ఇబ్బందిగా మార‌డంతో గిరిజన గ్రామాల్లోని మొత్తం సమూహంలోని ప్రజలకు కిరాణా సామాగ్రి మందులు అందించారు. అలారంపల్లి బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు .. గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మీసాల భూమన్న గుడమ్,గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాల కుగ్రామాలకు సాయం అందించారు. సుమారు 400 గిరిజన కుటుంబాలకు రానా సహాయం చేకూర్చారు.