పచ్చని చెట్లను నరికి ఎరువులు విత్తనాలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి: శ్రీధర్

కృష్ణాజిల్లా నందిగామ: నందిగామ పరిసరప్రాంతాలలో వివిధ రకాల ఎరువుల విత్తనాల కంపెనీలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసేందుకు పచ్చని చెట్లను నరికి వాటికి ఏర్పాటు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ నగర పంచాయతీ కమిషనర్ జయరామ్ కి బుధవారం నాడు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామిరెడ్డి శ్రీధర్ మాట్లాడుతూ రోడ్డుకిరువైపులా ఉన్న పచ్చని చెట్లకు విత్తనాలు ఎరువులు ప్రకటనలకు తీసుకోవాలి బోర్డులను ఏర్పాటు చేయడం చాలా బాధాకరమని, ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే పచ్చని చెట్లను తమ వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి చెట్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబు అని అన్నారు.3 నుంచి 4 కంపెనీ ప్రకటనలతో కంపెనీ ప్రచారం కొరకు రేకు మరియు ప్లాస్టిక్ వాటి పై, వారి కంపెనీ ప్రకటనలు ముద్రించి రొడ్డు ప్రక్కన గల చెట్లు,చెట్ల కొమ్మలకు కడుతున్నారని, మొక్కలు చనిపోయె విదంగా ఎండి పోయే విదంగా మేకులతో చెట్ల కొమ్మలను దుర్వినియోగం చేస్తున్నారు. కావున కంపెనీ డీలర్లు మరియు యజమానులకు ఈ విధానాన్ని వెంటనే పెద్ద మనసుతో ఆపు చేయవలసినదిగా పర్యావరణ పరిరక్షణ సమితి తరపున వినయ పూర్వక విజ్ఞప్తి చేస్తూ ,పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యతగా భావించి చెట్లకు నష్టం కలిగే విధానాన్ని అరికట్టి, పర్యావరణ పరిరక్షణ కై తోడ్పడుదాం. ఆక్సిజన్ కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటే చెట్లను ఇలా చెయ్యడం ఎంతో బాధకరమైన విషయం. వీరి పై వెంటనే తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరుతూ నందిగామ మునిసిపల్ కమీషనర్ డాక్టర్ జయరాంకి, మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆశ కి, నందిగామ అగ్రికల్చర్ ఆఫీసర్ ఖాసిం కి నందిగామ పర్యావరణ పరిరక్షణ సమితి కృష్ణ జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యములో మెమోరాండం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మారం సత్యనారాయణ, 14 వ వార్డు కౌన్సిలర్ మారాం అమరయ్య తదితరులు పాల్గొన్నారు.