చంద్రముఖి-2 మెయిన్ రోల్‌లో రాఘవ లారెన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ 2005 ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసిది. ప్రముఖ దర్శకులు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పాటు నయనతార, ప్రభు, జ్యోతిక కీలక పాత్రలు పోషించారు.  అప్పటి నుంచి ‘చంద్రముఖి సీక్వెల్‌ ‘ పై వార్తలు వస్తూనే ఉన్నాయి.   17 ఏండ్ల త‌ర్వాత  ఈ వార్తలకు తెరపడింది. చంద్ర‌ముఖి 2 అధికారిక అప్‌డేట్ ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది.. ఫ‌స్ట్ పార్టును డైరెక్ట్ చేసిన పి .వాసు చంద్ర‌ముఖి 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మేక‌ర్స్ ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ..టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. చంద్రముఖి చిత్రంలో సూపర్ స్టార్ హీరోగా నటిస్తే.. చంద్రముఖి 2 లో ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్ రాఘ‌వా లారెన్స్ సీక్వెల్ లో హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేదు..ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు..ఆర్ట్ డైరెక్ట‌ర్‌ తోట తరణి .