డిసెంబర్ 12న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో  ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. ప్రతి పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించనున్నారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.