తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి 20 ఏళ్ళు..!

పూరి జగన్నాథ్ – పరిచయం చేయాల్సిన అవసరం లేని ఈ వ్యక్తి , మనందరికీ పరిచయమయ్యి ఈరోజుతో 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది..! దర్శకుడిగా తన తొలి చిత్రం “బద్రి” సరిగ్గా ఈరోజు 2000లో విడుదలయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది..! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగకుండా తెలుగు ,కన్నడ హిందీ భాషల్లో కలిపి 33 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈతరం దర్శకులలో ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్..!

శివ సినిమా లో జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి , ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు పనిచేసి… ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా తన తొలి చిత్రాన్ని దర్శకత్వం వహించే స్థానాన్ని అతి త్వరగా సంపాదించుకొని, తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేని రీతిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు..!

బద్రి చిత్రం పూరి జగన్నాథ్ కన్న కలలును నిజం చేసింది.. టాలెంట్ ఉంటే ఎవరైనా దర్శకుడు అవ్వచ్చు అని అప్పటి కుర్రాళ్ల లో ఉత్సాహాన్ని నింపింది . .! ఆ చిత్రం ద్వారా వచ్చిన ఉత్సాహంతో పూరి జగన్నాథ్ బాచి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , పోకిరి , శివమణి , దేశముదురు , చిరుత, బుజ్జిగాడు, చిరుత, నేనింతే, ఏక్ నిరంజన్ ,గోలీమార్, బుడ్డా హోగా తేరా బాప్, బిజినెస్ మాన్ , టెంపర్ , ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించాడు. .!

పూరి జగన్నాథ్ హీరోలు, నటీనటులు పలికే ఒక్కో డైలాగ్ లు మాస్ అపిల్ తో పాటు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి..! పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో నటీనటులు ఆశిస్తూ ఉంటారు.. ఎందుకంటే ఆయన సినిమా ద్వారా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. . ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన క్రియేట్ చేసే పాత్రలు మట్టికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా తర్వాత రాబోయే ఫైటర్ చిత్రం ఘన విజయం సాధించి , దర్శకుడిగా మరో 20 ఏళ్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము..!