పుదుచ్చేరి రాష్ట్ర మద్యం స్వాధీనం..

గుంటూరు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గం..ముప్పాళ్ల గ్రామంలో పుదుచ్చేరి రాష్ట్ర మద్యం స్వాధీనం. రెండు బైకులు 109 మధ్యంసీసాలు సీజ్. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. గుంటూరు SEB Addl.SP SEB అసిస్టెంట్ కమీషనర్ మరియు నరసరావుపేట SEB సూపరింటెండెంట్ వారి ఆదేశ్యా ల ప్రకారం. సత్తెనపల్లి SEB ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలసి ది. 04-04-2021 వ తేదీన, ముప్పాళ్ల మండలం లోని గోళ్ళపాడు గ్రామము వద్ద నరసరావుపేట కు చెందిన అకిసెట్టి నాగ ప్రేమ్ చంద్, దేశు వెంకటేష్ మరియు గోళ్ళపాడు గ్రామము నకు చెందిన గోపు కోటేశ్వరరావు లను అదుపులోకి తీసుకోని వారి వద్ద పుదుచ్చేరి రాష్ట్రము నుండి అక్రమము గా రవాణా చేసిన (58) 750ml,(10)1000ml మరియు (41) 180ml పరిమాణము గల వివిధ రకములైన మద్యం సీసాలు, మొత్తము : 109 మద్యం సీసాలతో పాటు Hero HF Deluxe మోటార్ సైకిల్ మరియు TVS XL Moped లను స్వాధీనము చేసుకొని కేసు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సి ఐ మారయ్య బాబు విలేకర్ల సమావేశంలో తెలిపారు..