జాబ్ క్యాలెండర్ లో జాబులు లేవు

జనసేన పార్టీ నాయకుడు C రాజశేఖర్ మాట్లాడుతూ 18 తారీకున వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ లో జాబులు లేవు. ఓన్లీ క్యాలెండర్ మాత్రమే కనిపిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30 లక్షల పైగా నిరుద్యోగులు ఉంటే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10146 జాబులు ఉన్నాయని ప్రకటించడం చాలా దుర్మార్గం అని రోజుకు రోజుకు నిరుద్యోగ యువత పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించడం లేదన్నారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు జాబు రావాలంటే బాబు రావాలని నమ్మ పలికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి జాబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. టిడిపి హయాంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే జగనన్న ప్రభుత్వం రావాలని పదే పదే సభలలో కార్యక్రమంలో నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకొని ఈరోజు నిరుద్యోగ యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అని. నాడు మన ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా పనిచేసిన నీలం సాహ్ని గారు రాష్ట్రంలో 24000 ఉద్యోగాలు ఉన్నాయని పత్రిక ప్రకటన చేయడం జరిగింది.

నేడు మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు 10,146 ఉద్యోగాలు కేటాయించడం. చాలా దుర్మార్గం అని నిరుద్యోగులు నిరుద్యోగ తల్లిదండ్రులు బాధ పడుతున్నారు అని అన్నారు. అదేవిధంగా నాడు మాజీ సీఎస్ నీలం సాహ్ని గారు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 907 పోస్టులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు 7740 ఉన్నాయ్ అని తెలియజేయడం జరిగింది. కానీ నీ ఉద్యోగ నోటిఫికేషన్ పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ మోసం చేస్తుంది. గతంలో చెప్పిన లెక్కలకు ఏ మాత్రం పొంతన లేని ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ఎందుకంటే నేడు గ్రూప్ 1 గ్రూప్2 కు సంబంధించి 36 పోస్ట్లు వదలడం ఏ మాత్రం సబబు అని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 450 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లో పేర్కొనడం చాలా దురదృష్టకరమని మిగిలిన పోస్టులు ఎక్కడ ?. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రంలో 603756 జాబు లో ఇచ్చామని డప్పు కొట్టుకుంటున్నారు కానీ వాటిలో లో 259565 గ్రామ వార్డు వాలంటరీ ఉద్యోగాలు కల్పించారు కానీ వాటిని కూడా ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏ మాత్రం సబబు కాదు ఎందుకంటే గ్రామ వాలంటీర్లు మాకు శాలరీలు పెంచాలని కోరితే మీరు ఉద్యోగస్తులు కాదు మీరు స్వచ్ఛంద సేవకులుగా మాత్రమే అనిజగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి గారు మంత్రులు అత్యంత పారదర్శకంగా అవినీతి విపక్ష కు తావు లేకుండా జాబులు ఇచ్చామని అని పేర్కొనడం చాలా సిగ్గు చేటు. ఎందుకంటే ఇంతకుముందు సచివాలయ సభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ 90 శాతం సచివాలయ ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలకే ఇచ్చామని ఆయన మాటల్లోనే తెలియజేయడం జరిగింది కానీ నేడు జగన్ మోహన్ రెడ్డి గారు. ఎలాంటి విపక్ష పారదర్శకంగా అవినీతి కి చోటు లేకుండా ఉద్యోగాల్లో ఇచ్చామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. అంటే జగన్ మోహన్ రెడ్డి చెప్పేది నిజమా లేకుంటే విజయసాయిరెడ్డి చెప్పేది నిజమా ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధమైతే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేదా విజయసాయి రెడ్డి గారు చెప్పింది నిజమైతే విజయసాయి రెడ్డి గారిని వైసిపి ప్రభుత్వం నుండి తొలగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అసలు డీఎస్సీ ఉద్యోగాలు లేవు ఎక్కడ కూడా కేటాయించలేదు. కానీ కల్లబొల్లి మాటలతో నిరుద్యోగ యువత తో ఓట్లు వేయించుకొని. నిరుద్యోగ యువతను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు, ఒకసారి నిరుద్యోగ యువత కన్నెర్ర చేస్తే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనే విషయం జగన్ మోహన్ రెడ్డి గారు గ్రహించాలని. ఇప్పటికైనా ఇంతకు ముందు వదిలిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని. జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం మరొకసారి భేటీ అయి నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని, సరైన ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వదలాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, అనిల్ , ఆంజనేయులు, నూర్ భాషా, అజయ్ కుమార్, రాజు, అశోక్ కుమార్, చాంద్ భాషా, జయరాముడు, రవికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు