ప్రభాస్ ప్రాజెక్ట్​ కే​ కోసం హాలీవుడ్​లో ఎంక్వైరీ.

డార్లింగ్ ప్రభాస్​ కోసం హాలీవుడ్​లో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఇలాంటిది గతంలో ఏ భారత నటుడికీ జరగలేదని వెల్లడించారు. ప్రభాస్​ హీరోగా వైజయంతీ మూవీస్​ బ్యానర్​పై దత్​ నిర్మాణంలో ‘ప్రాజెక్ట్​ కే’ చిత్రం తెరకెక్కుతుంది. నాగ్​ అశ్విన్​ దర్శకుడు. దీపిక పదుకొణె హీరోయిన్​. బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అశ్వనీదత్. హాలీవుడ్​ నటులు, దర్శకులు.. ఒక భారత యాక్టర్​ కోసం ఇంత ఎంక్వైరీ చేయడం ఎవ్వరికీ జరగలేదు. ప్రభాస్​కు జరిగింది. నేను కచ్చితంగా చెప్పగలను.. ‘ప్రాజెక్ట్​ కే’ తర్వాత ప్రభాస్​కేవలం ఇంగ్లీష్ సినిమాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.