కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్.

ఈరోజు ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలని.. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతిందని తెలిపారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని చెప్పుకొచ్చారు. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికంగా ఉందని తెలిపారు. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశామని తెలిపారు.