చమురు ధరల పెంపుపై మోదీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రియాంకా గాంధీ.

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంక్‌ల వద్ద నిరసన చేపట్టి.. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ నుంచి పన్నుల ద్వారా రూ.2.74 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. ఈ డబ్బుతో దేశం మొత్తానికి టీకాలు అందించడంతో పాటు 718 జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు, 29 రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయవచ్చని, అలాగే, 25కోట్ల మంది పేద ప్రజలకు రూ.6వేలు చొప్పున సాయం అందించవచ్చని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అదేమీ చేయడంలేదంటూ మోడీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు