వరుస దొంగతనాలు చేసే వ్యక్తిని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు

జాతీయ రహదారులపై దారి దోపిడీ చేసే మరో ముఠాను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు

మాదకద్రవ్యాల సరఫరా చేసే అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు

ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్ద్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సింగరాయకొండ సర్కిల్ పోలీసులు జాతీయ రహదారిపై, డ్రైవర్లను బెదిరించి దారి దోపిడీ చేసే బందిపోటు ముఠా ను పట్టుకొని, పది మంది నేరస్థులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి కత్తి, కారు AP26TV A0199, 7 కేజీల గంజాయి, ఐదు వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ మొత్తం 8,60,000 వేల రూపాయల విలువ గలవి. అలాగే A6 వద్దనుండి 100 గ్రాముల గంజాయి దాని విలువ 500 రూపాయలు అలాగే A6 to A10 ల వద్ద నుండి రెండు కేజీల గంజాయి దాని విలువ పదివేల రూపాయలు, 850 గ్రాముల లాంటి పౌడర్ దాని విలువ లక్ష రూపాయలు మరియు వారి వద్ద నుండి బొమ్మ తుపాకీ దాని విలువ ఐదు వేల రూపాయలు మొత్తం సీజ్ చేసిన వస్తువుల విలువ ఒక 9,75,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు:-
బందిపోటు ముద్దాయిలు

 1. మొండి నవీన్ తండ్రి అనిల్, 23 సంవత్సరాలు, పట్టపు పాలెం, వెంకటేశ్వర స్వామి, గుడి వద్ద, కొత్త కుప్పం, తడ గ్రామం మరియు మండలం నెల్లూరు జిల్లా.
 2. ఆతాపాకం అజిత్ అలియాస్ అజిత్ రెడ్డి, తండ్రి పాలని, 25 సంవత్సరాలు, కులం రెడ్డి, పల్లెపాలెం గ్రామం, తడ మండలం, నెల్లూరు జిల్లా.
 3. అబిబుల్లా మహమ్మద్ జాఫర్ సాదిక్ తండ్రి అబిబుల్లా, 21 సంవత్సరం, ముస్లిం, చీమలవారిపాలెం గ్రామం, కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా.
 4. వేనాటి జ్ఞానేష్ అలియాస్ జ్ఞానేష్ రెడ్డి తండ్రి యుగంధర్ రెడ్డి, 21 సంవత్సరం, రెడ్డి కులం ,మన్నార్ పేట గ్రామం, సూళ్ళురుపేట మండలం, నెల్లూరు జిల్లా.
 5. వేమన బోయిన సాయి సందీప్ తండ్రి సురేంద్ర, 27 సంవత్సరాలు, యాదవ కులం, బాపూజీ కాలనీ, సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా.
  మాదక ద్రవ్యాల వ్యాపారం చేయు ముసుగులో మోసం చేయు ముద్దాయిలు:-
 6. సయ్యద్ రహిమాన్ భాష అలియాస్ రహిహన్ తండ్రి అహ్మద్ భాషా, 24 సంవత్సరాలు, ముస్లిం కులం, తడ కండ్రిగ, హెచ్. డి. ఎఫ్. సి బ్యాంకు వద్ద, తడ, నెల్లూరు జిల్లా.
 7. చిట్టేటి చంద్రశేఖర్ అలియాస్ చండ్ర తండ్రి రమణయ్య, 24 సంవత్సరాలు, కులం ముత్తారాశి, మధురవాడ, వేదాయపాలెం మండలం, చిత్తూరు జిల్లా.
 8. చండ్ర మహేష్ తండ్రి చంద్ర, 22 సంవత్సరాలు, విశ్వబ్రాహ్మణ, గణపతి నగర్, 4వ లైన్, పుత్తూరు గ్రామం మరియు మండలం, చిత్తూరు జిల్లా.
 9. పలని దినేష్ అలియాస్ దినేష్ కుమార్ తండ్రి పలని ఫజని మసిల్ మణి, 28 సంవత్సరాలు,పంట్ర రెడ్డి కులం. మనాలి గ్రామం, చెన్నై
 10. కొండ స్వామి శ్రీధర్ తండ్రి కొండ స్వామి, 30 సంవత్సరాలు, మండలియ కులం, మనాలి, మాధవరం మండలం, తిరువల్లూర్ జిల్లా, చెన్నై సిటీ.
  A1 to A5 ముఠాగా ఏర్పడి జాతీయ రహదారులపై బందిపోటు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు A6 ఆర్థిక సహాయం చేయగా, A2 తాను బాడుగ కు కార్లతో A1 to A5 లతో కలిసి బయలుదేరి 7.10.2020 అర్ధరాత్రి 01.10 నిమిషాలకు జాతీయ రహదారి పై టంగుటూరు టోల్ గేట్ దగ్గర పోతుల చెంచయ్య కోల్డ్ స్టోరేజ్ వద్ద లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావును కత్తితో బెదిరించి, అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్, ఆరు వేల రూపాయల నగదు లాక్కొని వెళ్ళినారు.
  అదే రోజు అదే విధంగా A1 to A5 లు అక్కడి నుండి కొద్ది దూరం వెళ్లి హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక లారీ డ్రైవర్ లారీని ఆపి తన లారీ టైర్లలో గాలి చెక్ చేసుకుండగా ఆ డ్రైవర్ ను కత్తితో బెదిరించి, అతని వద్దనుండి 1000 రూపాయలు లాక్కొని దోపిడీకి పాల్పడినారు. ఈ రెండు సంఘటనల పై టంగుటూరు పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు నమోదు కాబడినవి అనంతరం శ్రీ ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వెంటనే స్పందించి బందిపోటు నేరాన్ని తీవ్రంగా పరిగణించి ఒంగోలు డిఎస్పి శ్రీ కె. వి. వి. ఎస్. వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు రూరల్ సిఐ, సింగరాయకొండ సిఐ, ఇంకొల్లు లతో మూడు స్పెషల్ టీం లను నియమించారు. ఈ నేరాలు జరిగిన తీరును పరిశీలించిన ఎస్పీ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించిమని పిసిఆర్ నుండి స్పెషల్ టీం పంపించగా, ముద్దాయి ఉపయోగించిన కారును సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం అయినది. దాన్ని ఆధారంతో ముద్దాయిలు దొంగిలించిన సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా మూడు టీం లను వివిధ ప్రదేశాలకు పంపడమైనది.
  అందులో భాగంగా ఈరోజు ఏకకాలంలో A1 to A5 లను టంగుటూరు BVR గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుండి 1) 8 లక్షల రూపాయల విలువ గల కారు, 2) కత్తి 3)7 కేజీల గంజాయి 4) ఒక సెల్ఫోన్ 5) ఐదు వేల రూపాయల నగదు మొత్తం 8లక్షల 60 వేల రూపాయల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
  A6 ను నెల్లూరు జిల్లాలోని తడ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 500 రూపాయల విలువ గల 100 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా A 7 to A10 లను చెన్నై లోని రాటల్ చేపల చెరువు వద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి, 850 గ్రాములు కొకైన్ లాంటి తెల్లని పౌడర్ ను A10 వద్ద నుండి ఐదు వేల రూపాయల విలువ గల బొమ్మ తుపాకీని మొత్తం వీటి విలువ 1,15,000/- రూపాయలు అలాగే స్వాధీనం చేసుకోవడం మైనది.
  ఈ కేసును చేదించటం అత్యంత ప్రతిభ కనబరిచిన ఒంగోలు DSP KVVSV ప్రసాద్ గారు, సింగరాయకొండ సిఐ యం శ్రీనివాసరావు గారు, ఒంగోలు రూరల్ సిఐ పి సుబ్బారావు గారు, ఇంకొల్లు సిఐ MD అల్తాఫ్ గారు, PCR ఇన్ స్పెక్టర్ రాంబాబు గారు, ఐటి కోర్ SI నాయబ్ రసూల్ గారు, కె.అజయ్ కుమార్, టంగుటూరు SI యం.శ్రీనివాసరావు, సింగరాయకొండ SI యల్.సంపత్ కుమార్, కొండేపి SI వి.రాంబాబు గారు మరియు సిబ్బంది ని అబినందించినారు.
  అంతే అంతేగాక 7. 10.2020 నా ఒంగోలు తాలూకా పీఎస్ పరిధిలో 13 సాంసంగ్ మొబైల్స్ మరియు వాటి ఉపకరణాలను ఒంగోలు కర్నూల్ రోడ్ లో గల స్నేహ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పైకప్పును పగలగొట్టి దొంగిలించిన కేసు లో ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు నేరం జరిగిన తీరు తెలుసుకుని డి.ఎస్.పి కె.వి.వి.ఎస్ వి ప్రసాద్ గారు, CCS DSP A. ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో తాలూకా ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఒక టీం ను నియమించి వెంటనే ఇలాంటి నేరాలకు పాల్పడే పాత నేరస్తుల సమాచారాన్ని ఫొటోలతో సహా డిసిఆర్బి ద్వారా సేకరించి తాలూకా ఇన్స్పెక్టర్ కు అప్పగించడం అయినది. వెంటనే పాత నేరస్తుల అందర్నీ నేరం జరిగిన రోజు వారంతా ఎక్కడ ఉన్నారని పరిశీలించిన మీదట వట్టెం సాయి బాబు @ సాయి కుమార్ తండ్రి జంగయ్య, 22 సంవత్సరాలు, అల్లాపూర్ గ్రామం, తాండూరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నేరానికి పాల్పడినట్లు గుర్తించి సదరు ముద్దాయి గురించి వెతకగా ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఐటీ విభాగం ద్వారా టెక్నాలజీ సాయంతో ముద్దాయి సెల్ ఫోన్ ద్వారా ఒంగోలు లో NH16 పాత బైపాస్ పాత బ్రిడ్జి వద్ద ఎనిమిది గంటలకు అరెస్టు చేసి అతని వద్దనుండి నాలుగు లక్షల యాభై వేలు రూపాయల విలువ గల 13 సాంసంగ్ మొబైల్స్ ను మరియు వాటి ఉపకరణాలను స్వాధీనం చేసుకోవటమైనది, సదరు ముద్దాయి ఈ క్రింది 5 కేసులలో నేరస్తుడిగా ఉన్నట్లు గుర్తించడం అయినది.
 11. గద్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు, 2 షాద్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు, 3.జడ్చర్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు, 4.మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ ఒక కేసు, 5.ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఒక కేసు.
  ఈ కేసును చేదించటం అత్యంత ప్రతిభ కనబరిచిన ఒంగోలు తాలూకా ఇన్ స్పెక్టర్ శివ రామ కృష్ణ రెడ్డి, ఐ టి కోర్ SI నాయబ్ రసూల్, తాలూకా SI సోమ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ కే రామకృష్ణ, కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుల్ వరదయ్య లను sp గారు అభినందిచారు.
  ఈ కేసులు అన్నింటిలో కలిపి ముద్దాయిలు వద్ద నుండి 14,25,000 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకొనడం అయినది.