రిటైర్డ్ హోంగార్డ్ కు చెక్కుపంపిణీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్.

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నందు చీరాల సబ్ డివిజన్ పరిధిలో హోంగార్డ్ విధులు నిర్వహిస్తున్న శ్రీ షరాబు బసవయ్య (HG No-122) 36 సంవత్సరాలు విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారులు అభినందనలు పొందుతూ తేది:30.06.2021 న రిటైర్డ్ అయ్యారు. వారికి ఆసరాగా ఉంటుడకు ప్రకాశం జిల్లా హోం గార్డ్స్ అందరు ఒక రోజు వేతనం 4,87,770 రూపాయల చెక్కును ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ చేతుల మీదగా అందజేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుందని తెలియచేసినారు. అనంతరం హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.బాబురావు మరియు హోం గార్డ్ సభ్యులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏవో యం.సులోచన , హోం గార్డ్ RI సుబ్బారావు , RSI. పద్మారావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేంద్రబాబు  ,Home గార్డ్ PRO బి.వెంకటేశ్వర్లు, కోపరేటివ్ ఆఫీస్ శ్రీను, హోంగార్డులు మరియు ఇతరులు పాల్గొన్నారు.