ప్రభాస్ మారుతి సినిమా వెనక్కి వెళ్ళిందా ?
ప్రభాస్ మారుతి కలిసి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే కథ కూడా లాకైనట్టు వార్తలు వచ్చాయి. ఈ మూవీ కోసం భారీ సెట్స్ కూడా నిర్మిస్తున్నట్టు. చాలా తక్కువ రోజుల్లోనే ప్రభాస్ – మారుతి ప్రాజెక్ట్‌ను ఫినిష్ చేయాలని భావించినట్టు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మరో కొత్త టాక్ వినిపిస్తోంది. దాన్ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలాలేదని తెలుస్తోంది. దీనికి కారణం రాధేశ్యామ్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ మూవీ గనక భారీ హిట్ సాధించి ఉంటే మారుతి సినిమాను వెంటనే లైన్‌లో పెట్టేవాడు ప్రభాస్. కానీ, అనూహ్యంగా రాధేశ్యామ్ భారీ ఫ్లాప్ అని తేల్చేశారు. దాంతో బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా రెండు ఫ్లాపులు చూసిన ప్రభాస్ ప్లాన్ మార్చుకున్నాడట.
మారుతి ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకువచ్చి వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్న ప్రభాస్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టినట్టు సమాచారం. ముందు సలార్ , ప్రాజెక్ట్ కె సినిమాలపై దృష్టిపెట్టాడట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ చిత్రాన్ని కంప్లీట్ చేస్తూనే మరొకవైపు ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈ నవంబర్ నాటికి సలార్ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రభాస్ సలార్ మూవీ మీదనే పూర్తిగా దృస్టి సారించారు. దాని తర్వాత ప్రాజెక్ట్ కె, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని పూర్తి చేయనున్నారట. ఇవి పూర్తయ్యాకే మారుతి సినిమాను చేసేలా ప్రభాస్ ప్లాన్ చేసుకునట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.